Home / TELANGANA / లంచం అడిగితే చెప్పుతో కొట్టండి : సీఎం కేసీఆర్‌

లంచం అడిగితే చెప్పుతో కొట్టండి : సీఎం కేసీఆర్‌

కార్మికులు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటి నుంచి లంచం అడిగిన వాణ్ని తన్నాలని అన్నారు సీఎం కేసీఆర్‌. లంచం అడిగితే అక్కడే చెప్పుతీసుకొని ఓ దెబ్బ కొట్టాలని సూచించారు. ఎవరైనా ఏమైనా అంటే తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అడుగు తీసి అడుగు వేస్తే లంచాలు తీసుకొనే సంస్కృతి బంద్‌ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ప్రగతి మైదానంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల ఆత్మీయ సభలో ప్రసంగించారు.

see also :తెలంగాణ జీవ‌న విధాన‌నికి అద్దం ప‌ట్టిన‌ కార్టూనిస్ట్ ర‌మ‌ణ చిత్రాలు

ఆ మూడింటినీ ప్రయివేటీకరించబోం

దేశంలో బొగ్గు గనులను ప్రయివేటీకరిస్తామని కేంద్రం అంటోందని, అదృష్టవశాత్తు సింగరేణిపై పెత్తనం చెలాయించే అధికారం కేంద్రానికి లేదన్నారు. సింగరేణిని ప్రయివేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టంచేశారు. ఒకవేళ చేయాలనుకుంటే కేంద్రం తన వాటా తీసుకోవచ్చని తేల్చి చెప్పారు. అందుకు అవసరమైన మొత్తం ఇచ్చి రాష్ట్రం ఆధీనంలోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డు, టీఎస్‌ ఆర్టీసీ, సింగరేణిని ప్రయివేటీకరించే ప్రశ్నే లేదని ఉద్ఘాటించారు. ఈ సంస్థలను బలోపేతం చేస్తాం తప్ప ప్రయివేటీకరించబోమని సీఎం తేల్చి చెప్పారు. సింగరేణి కార్మకులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా ప్రారంభించిన ఆరు భూగర్భ గనుల్లో 4500 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. అలియాస్‌ అని ఉండే కార్మికులకు ఇకపై ఎలాంటి నోటీసులు రావన్నారు.

see also :కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచ‌న‌

వాళ్లు నాయకులు కాదు రాక్షసులు..

కార్మికుల రక్తం తాగేవాళ్లు రాక్షసులే తప్ప నాయకులు కారన్నారు. కార్మికుల సభ్యత్వ రుసుం ఒకే ఒక్క రూపాయి అని, అంతకు మించి ఎవరూ కట్టొద్దని సూచించారు. లంచాల విషయంలో మన వద్ద కూడా నియంత్రణ ఉండాలని తెలిపారు. తమ పని ముందు చేయాలంటూ లంచాలు ఇచ్చే విధానం మానుకోవాలన్నారు. లంచాలు ఇచ్చే విధానాన్ని కార్మికులుకూడా మానుకోవాలని సూచించారు. సింగరేణి కార్మికులను వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని మళ్లీ కోరతామన్నారు. మంచిర్యాల జిల్లా పారిశ్రామికంగా రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉండబోతుందని చెప్పారు. మంచిర్యాల నుంచి అంతర్గాం, రామగుండం వరకు వంతెన నిర్మిస్తామని వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణానికి రేపు రూ.125 కోట్లు మంజూరు చేస్తానన్నారు. కారుణ్య నియామకాల ద్వారా కార్మికులపిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని, మార్చి మొదటి వారంలోనే ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

see also :చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat