తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా ప్రొఫెసర్ జయశంకర్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ సాధించుకోవడంతో పాటు, ఆయన కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడం ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.ఇవాళ జయశంకర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
