తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పరిధిలో పెరిక కులస్తులకు భవనం నిర్మాణం కోసం అవసరమైన స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పెరిక భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు శ్రీరాం భద్రయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర శివార్లలో పెరిక భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్థల సేకరణ జరపాలని సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, రంగారెడ్డి కలెక్టర్ ను ఆదేశించారు.
see also:బోనాల పండుగకు రూ.15 కోట్లు..!!
‘‘హైదరాబాద్ నగర నడిబొడ్డున ఖైరతాబాద్ చౌరస్తాలో పెరిక భవన్ ఉండేది. ఎంతో మంది విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చింది. నగరంలో వెలిసిన మొదటి హాస్టళ్లలో అది ఒకటి. కానీ రోడ్డు వెడల్పు వల్ల పెరిక భవన్ దాదాపు 80 శాతం కూల్చివేయాల్సి వచ్చింది. కాబట్టి పెరిక కులస్తులకు మరో చోట భవన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం స్థలం సేకరణ జరపాలి’’ అని సిఎం ఆదేశించారు.