Home / 18+ / నిర్మల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…సీఐ పరిస్థితి విషమం

నిర్మల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…సీఐ పరిస్థితి విషమం

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రోడ్లు ఎరుపెక్కుతున్నాయి. మొన్న లింగంపల్లి, నిన్న కొండగట్టులో ఆర్టీసి బస్సులు ప్రమాదానికి గురవడంతో చాలా మంది ప్రయాణికులు బలయ్యారు.తాజాగా నిర్మల్ జిల్లా సోన్ మండల పరిధిలోని కడ్తాల్ గ్రామ శివారు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐ జూపాక కృష్ణ‌మూర్తికి తీవ్రగాయాలయ్యాయి.

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. సీఐ తో పాటు ఆయన భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సీఐ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.తీవ్ర గాయాలపాలవడంతో పాటు అధికంగా రక్తస్రావమవడంతో సీఐ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.