Home / TELANGANA / హైకోర్టు కొత్త భ‌వ‌నం..ఎక్క‌డ నిర్మించ‌నున్నారో తెలుసా?

హైకోర్టు కొత్త భ‌వ‌నం..ఎక్క‌డ నిర్మించ‌నున్నారో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూత‌న భ‌వ‌నం నిర్మించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. హైకోర్టు కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బుద్వేల్ లో అధునాతన బిల్డింగ్ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం రెండు వారాల క్రితం హైకోర్టు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుత బిల్డింగ్ నగర నడిబొడ్డున ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, బుద్వేల్ లో నిర్మిస్తే ఆ సమస్య ఉండదని, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.

 

హైకోర్టు ప్రస్తుత బిల్డింగ్‌ను మూసి నది ఒడ్డున ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు. 1915 ఏప్రిల్15న మొదలైన పనులు నాలుగేళ్లపాటు కొనసాగాయి. 1920 ఏప్రిల్ 20న భవనాన్ని ప్రారంభించారు. నిజాం పాలన పూర్తయ్యే వరకు ఈ భవనంలోనే హైకోర్టు కార్యాకలాపాలు కొనసాగాయి. రాష్ట్ర విభజనకు ముందే ఈ ప్రాంతంలో హైకోర్టు నిర్మా ణానికి అప్పటి సర్కారు 70 ఎకరాలు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం కారణంగా అది అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం ఆ భూమి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధీనంలో ఉంది. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 70 ఎకరాలను తమకు ఇవ్వాలని వారు కోరినట్లు స‌మాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat