అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్…దీనిని అమెజోనియా లేదా అమెజాన్ జంగిల్ అని కూడా అంటారు, ఇది అమెజాన్ బయోమ్‌లోని తేమతో కూడిన బ్రాడ్లీఫ్ ఉష్ణమండల వర్షారణ్యం. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిన్లో ఎక్కువ భాగం కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో తొమ్మిది దేశాలకు చెందిన భూభాగం ఉంది.మెజారిటీ అటవీప్రాంతం బ్రెజిల్లో ఉంది, 60% రెయిన్‌ఫారెస్ట్, తరువాత పెరూ 13%, కొలంబియా 10%, మరియు వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, సురినామ్ మరియు ఫ్రెంచ్ గయానాలో స్వల్ప మొత్తంలో ఉన్నాయి. ఇంత పెద్ద ఫారెస్ట్ నుండి గత కొద్దిరోజులుగా వస్తున్న మంటలు వల్ల అక్కడి ప్రకృతికే కాదు యావత్ ప్రపంచానికే ప్రమాదం వాటిల్లనుంది. ఇది ఇలానే ఉంటే వాతావరణంలో చాలా భయంకరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ అడవిలో కొన్ని కారణాల వల్ల మంటలు చెలరేగడం సహజమే కాని అవి మూడు, నాలుగు రోజులకు ఆరిపోతాయి. కాని ఈసారి మాత్రం అలా జరగలేదు. కాబట్టి ఇది చాలా ప్రమాదమని చెప్పాలి.. ఎందుకంటే భూమిపై మానవాళికి అందుతుంది 20% ప్రాణవాయువు ఇక్కడ నుండే లబిస్తుంది.