Home / TELANGANA / గవర్నర్ నరసింహన్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

గవర్నర్ నరసింహన్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

గవర్నర్‌ నరసింహన్‌ బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనేక సార్లు మిమ్మల్ని కలిసే మంచి అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు రాష్ట్రానికి తండ్రి పాత్ర పోషించి, మార్గనిర్దేశం చేసింనందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్ని సమస్యలొచ్చినా పరిష్కరించగల సమర్థుడాయన అంటూ కేటీఆర్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన సలహాలు, సూచనలు ఎప్పటికీ మర్చిపోలేనివని, ఆయన ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.