Breaking News
Home / TELANGANA / మన పట్టణాన్ని మనమే బాగుచేసుకుందాం..మంత్రి నిరంజన్ రెడ్డి

మన పట్టణాన్ని మనమే బాగుచేసుకుందాం..మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి మున్సిపాలిటీలో స్వచ్చ వనపర్తి కార్యక్రమాన్ని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని అన్నారు. మన పట్టణాన్ని మనమే బాగుచేసుకుందామన్నారు. 15 రోజులలో పట్టణ రూపురేఖలు మారాలన్నారు. పరిసరాల పరిశుభ్రత మెరుగుపడాలన్నారు. ప్రజలంతా భాగస్వాములై చేయాల్సిన ప్రజాహిత కార్యక్రమం ఇది అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలన్నారు. స్వచ్చ వనపర్తి కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని ఐదు రోజులు శ్రమదానం చేయనున్నట్లు తెలిపారు.