ప్రస్తుతం ఈడీ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కేంద్ర మాజీ ఆర్థిక.. హోం శాఖ మంత్రి చిదంబరానికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సోమవారం ఎయిమ్స్ కు తరలించారు.
చికిత్స ముగిసిన తర్వాత తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం చిదంబరాన్ని ఎయిమ్స్ కు పంపించారు. అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు గంటల ప్రాంతంలో తిరిగి చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు.