Home / TELANGANA / దుర్గం చెరువు అందాలను షేర్ చేసిన మంత్రి కేటీఆర్

దుర్గం చెరువు అందాలను షేర్ చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని దుర్గం చెరువును రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారీ బడ్జెట్ తో దుర్గం చెరువు వద్ద సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మరొకొద్ది రోజుల్లో ఈ చెరువు సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. ఈ బ్రిడ్జ్ పనులు పూర్తైతే నగర వాసులను రవాణా ఎంతో సులువుగా మారుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈబ్రిడ్జ్ నిర్మాణ పనులను ఐటీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా షేర్ చేసారు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ను పలు కోణాల్లో ఫొటోలు తీసి వాటిని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరితో పంచుకున్నారు. కాగా, ఈ వంతెన నిర్మాణం పూర్తయితే నగరంలోని అనేక ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ కు రవాణా సులభతరం అవుతుందని ఇంజినీరింగ్ సిబ్బంది తెలిపారు.