Home / TELANGANA / ఉల్లి సాగుకు ప్రోత్సాహం అందించండి..మంత్రి నిరంజన్ రెడ్డి

ఉల్లి సాగుకు ప్రోత్సాహం అందించండి..మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో కూరగాయల సాగును మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అలాగే ఉల్లిసాగును కూడా ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ , సహకార, ఉద్యానశాఖలపై సమీక్ష నిర్వహించి అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. కూరగాయల సాగును పెంచాలని సూచించిన మంత్రి… పత్తి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించాలన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో ఏ మాత్రం అవకతవకలు జరద్దని… ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఉల్లి పంట ప్రోత్సాహానికి ప్రభుత్వ సబ్సిడీ విత్తనం అందించే యోచనలో ఉందని రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నుండి ఒక ధరను నిర్ణయించాలని భావిస్తున్నాం అన్నారు.

ఎండాకాలంలో రైతులు తప్పనిసరిగా కూరగాయలు సాగుచేసేలా చూడాలి…. రైతులు వేసిన పెసరపంటను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దారించాలన్నారు. కిచెన్ గార్డెన్ లపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సహించండి… పందిరి కూరగాయల సాగుకు సహకారం 90 శాతం సబ్సిడీతో సహకారం అందిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat