Breaking News
Home / TELANGANA / గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్..

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్..

రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాలను ఏకం చేస్తూ హరిత ఉద్యమం అద్భుతంగా ముందుకెళ్తోంది. పర్యవరణ హితం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో… రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు వ్యాపార ప్రముఖులు కూడా భాగస్వాములై మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నాటగా… తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు అనంతరం… తణుకు ఎమ్మెల్యే కనుమూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఎంపీ రఘురామ రాజుకు మొక్కలు నాటాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.