Breaking News
Home / TELANGANA / తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త ..!!

తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త ..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు శుభవార్తను తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుండో కొత్త సచివాలయం నిర్మించాలని అనుకుంటున్న సంగతి విదితమే.

ఈ క్రమంలో కొత్త సచివాలయం డిజైన్లు,ప్రణాళికల రూపకల్పనపై తుది నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ప్లాన్ ,బడ్జెట్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి పన్నెండో తారీఖులోపు తమకు సమర్పించాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి పన్నెండో తారీఖుకు వాయిదా వేసింది.