Home / TELANGANA / సీఎం కేసీఆర్ పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం..మేయర్‌

సీఎం కేసీఆర్ పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం..మేయర్‌

ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగానే

సీఎం పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి, సీఎంకు పుట్టినరోజు కానుక ఇవ్వాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. నగరంలోని అన్ని వార్డుల్లో కార్పోరేటర్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మేయర్‌ తెలిపారు.

సీఎం పుట్టిన రోజు సందర్భంగా నగరవ్యాప్తంగా 2.5 లక్షల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేయర్‌ పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు మొక్కల పంపిణీకి అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మొక్కలు నాటడమే కాదు.. వాటి పరిరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని ఆయన అన్నారు.