Home / LIFE STYLE / కరోనాతో ఎవరికి ఎక్కువ ప్రమాదం..!

కరోనాతో ఎవరికి ఎక్కువ ప్రమాదం..!

కరోనా వ్యాధి వల్ల ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ప్రమాదమే ఎక్కువ. నడివయసువారి కన్నా వృద్ధుల రేటు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

చైనాలో 44 వేలకు పైగా కేసులపై జరిపిన, తొలి అధ్యయనంలో ఇది వెల్లడైంది. ముప్పై ఏండ్లలోపు వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో ఎనిమిది మంది చనిపోయారు.

వైరస్‌ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులున్న వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంది.