Home / TELANGANA / నిమ్స్ దవఖానా సిబ్బందికి కరోనా..!

నిమ్స్ దవఖానా సిబ్బందికి కరోనా..!

హైదరాబాద్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 12 మంది పీజీ విద్యార్థులకు కరోనా వైరస్ బారినపడగా తాజాగా నిమ్స్ కు చెందిన నలుగురు డాక్టర్లు ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది.

కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బంది కొవిడ్-19 లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేసినట్లు నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షల్లో వారికి కరోనా సోకినట్లు నిర్ధారించామన్నారు.

నలుగురు డాక్టర్లు నిమ్స్ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేస్తున్నారని, ఇందులో భాగంగా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తారన్నారు. క్యాత్ ల్యాబ్ లో పనిచేస్తున్న మరో ముగ్గురు సిబ్బంది కూడా కరోనా సోకినట్లు చెప్పారు.