ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిబద్దత కల్గిన రాజకీయ వేత్త, జీవితాంతం స్వరాష్ట్ర ఆకాంక్షతో పోరాడిన తెలంగాణ వాది, బడుగుల ఆశాజ్యోతి,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 102 వ జయంతి సందర్భంగా ఆ తెలంగాణ యోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను..కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించారు. ఆసిఫాబాదులో ప్రాథమిక విద్య చదివిన ఆయన ఆ తర్వాత హైదరాబాదులో లా చదివారు..1940లో న్యాయవాద వృత్తిన చేపట్టిన బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటుంటే , తెలంగాణ ప్రజలు నిజాం పాలనలో మగ్గిపోతుండడం చూసి కొండా లక్ష్మణ్ బాపూజీకి ఆవేదన చెందేవారు..నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో ఆయన కీలక పాత్ర పోషించారు 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే.ఆ సమయంలో ఆజ్ఞాతంలో ఉండి నిజాం సైన్యం నుంచి తప్పించుకున్నారు. 1948లో తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్ లో విలీనం అయిన తర్వాత 1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1969లో తెలంగాణ ఉద్యమ తొలి దశ పోరాటంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పదవీ త్యాగం చేసిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఆ తర్వాత తెలంగాణ సాధన సమితి పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించారు. ఆయన గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే నిఖార్సయిన తెలంగాణ వాది…నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన ఆయన తెలంగాణ మలి దశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచారు..మన టీఆర్ ఎస్ పార్టీ మొదట పుట్టిందే బాపూజీ ఇంట్లో.. 2001 ఏప్రిల్27న మన టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం కూడా బాపూజీ నివాసమైన నాటి `జల దృశ్యం`లోనే జరిగింది. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి తన ఇంటినే ఇచ్చారు. మలి దశ తెలంగాణ ఉద్యమానికి బాపూజీ నివాసమైన జలదృశ్యం కేంద్రం కావడంతో, వణికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం చిన్న సాంకేతిక కారణం చూపి కొండా లక్ష్మణ్ బాపూజీని జలదృశ్యం నుంచి దౌర్జన్యంగా పోలీసు బలగాలతో ఖాళీ చేయించింది. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సైతం దౌర్జన్యంగా అక్కడి నుంచి తొలగించారు పోలీసులు. ఆ తర్వాత అన్ని పార్టీల జోక్యంతో… 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, బాపూజీ తుదిశ్యాస విడిచేంత వరకు నివసించిన గాంధీ నగర్‌లోని నాలుగు గదుల ఇంటిని కేటాయించిందే తప్ప జీవితకాలం నివసించిన జలదృశ్యం తిరిగి అప్పగించలేదు.2009 డిసెంబర్9 ప్రకటన తర్వాత కేంద్రం ఇచ్చిన తెలంగాణపై వెనక్కి పోవడంతో ఆయన ఆవేదన చెందారు… గజగజా వణికించే ఢిల్లీలో 97 ఏళ్ల వృద్ధుడైన ఆయన నవయువకుడిలా..పలువురు స్వాతంత్య సమరయోధులతో కలిసి వారం రోజులు సత్యాగ్రహదీక్షకు కూర్చొని… కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానంలో మరోసారి కదలిక తెప్పించగలిగారు. కొండాలక్ష్మణ్ బాపూజీ అందించిన స్ఫూర్తితో మన నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రజలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు..నేడు సీఎం కేసీఆర్ గారు ఆయన అందించిన విలువలే స్ఫూర్తిగా బంగారు తెలంగాణ నిర్మాణానికి అశర్నిశలు శ్రమిస్తున్నారు..బడుగులకు సామాజిక న్యాయం దక్కాలి అన్న ఆయన మాటే వేదంగా సీఎం కేసీఆర్ గారు బడుగుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు..సీఎం కేసీఆర్ గారి పాలనే ఆ మహనీయుడికి అందించే ఘనమైన నివాళి..తెలంగాణ కోసం తన జీవితాన్ని ధారబోసిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 101 వ జయంతి ఉత్సవాలను నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తుంది..సీఎం కేసీఆర్ గారు స్వయంగా శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ కి యావత్ తెలంగాణ ప్రజల తరపున ఘనంగా నివాళులు అర్పించనున్నారు..జీవితాంతం తెలంగాణ కోసం తపించిన తపస్వి కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తరతరాలకు సదా సూర్తిదాయకం ..
జై కేసీఆర్..జైజై తెలంగాణ…
మీ
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి