ఏఐటీయూసీ చంద్రబాబుతో పొత్తుపెట్టుకొని ఆంధ్రాకు వెళ్లి వారసత్వ ఉద్యోగాలు తెస్తారా అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్‌కే 5గనిపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ బాల్క సుమన్ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి మాట్లాడారు. తెలంగాణ ద్రోహి టీడీపీతో పొత్తు పెట్టుకొని కార్మికులను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
టీబీజీకేఎస్ గెలుపు ఖాయం… మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
మందమర్రి రూరల్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయకేతనం ఎగురవేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని విప్ నల్లాల ఓదెలు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌పై కార్మికులకు ప్రగాఢమైన నమ్మకం ఉందన్నారు. ఎక్కడ చూసినా టీబీజీకేఎస్‌కు కార్మికులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య పాల్గొన్నారు.