నేడు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్ బర్త్‌డేని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ రాష్ట్రపతి భవన్‌కు ప్రత్యేకంగా పుష్పగుచ్చం పంపించారు. ఈ సందర్భంగా శ్రీ రామ్‌నాథ్ కోవింద్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని…దేశానికి మరిన్ని సేవలు అందించాలని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు. ప్రధామమంత్రి మోదీ కూడా రామ్‌నాథ్ ఆయురారోగ్యాలతో జీవించాలని..దేశానికి సేవ చేయాలని మోదీ ట్వీట్ చేశారు. కేసీఆర్, మోదీలతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
