సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీలతో కల్సి పోటీ చేస్తున్నామని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. 6 నుంచి సీపీఐ చేపట్టబోతున్న పోరుబాట కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను
మగ్దూం భవన్‌లో విడుదల చేసిన చాడ ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఓటమి భయంతోనే మంత్రులు, ఎంపీలంతా సింగరేణి కాలరీస్ ప్రచారంలో పాల్గొంటున్నారని చాడ ఆరోపించారు.
