సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా పోరాడి రవి అస్తమించని బ్రిటీష్ పాలకులను తరిమి కొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించిపెట్టారు జాతిపిత మహాత్మాగాంధీ. గాంధీజీ బాటలో సత్యాగ్రహం, అమరణ నిరహారదీక్షలతో పూర్తిగా అహింసాయుత మార్గంలో ప్రజలందరిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన కేసీఆర్ తెలంగాణ బాపూజీగా కొనియాడబడుతున్నారు..అదే కోవలో ఎంపీ మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌ను తెలంగాణ గాంధీ అని ప్రశంసించారు. మహాత్మాగాంధీ దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తే కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్నీ సాధించి పెట్టారని ఎంపీ మల్లారెడ్డి కొనియాడారు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా మన్సూరాబాద్ పరిధిలోని సహారాస్టేట్స్ టౌన్‌షిప్ వద్ద గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్.. తెలంగాణ గాంధీ అని తనదైన శైలిలో అభివర్ణించారు.దీంతో అక్కడ అంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు..ఉన్నది ఉన్నట్లు, భోళాగా మాట్లాడే మల్లారెడ్డి..తనదైన శైలిలో కేసీఆర్‌ను తెలంగాణ గాంధీ అని కీర్తించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
