రేపటి నుంచి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనను సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నారాయణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
