ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో మీడియా సెల్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ సెల్ ఏర్పాటు నిర్మాణానికి రూ. 42 లక్షలను మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ మంజూరు చేసింది. ఇటీవలి కాలంలో ప్రగతి భవన్‌లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు.. మీడియా సెల్ ఉపయోగపడనుంది.
