గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలాలపై అక్రమ నిర్మాణ తొలగింపు ప్రక్రియను జీహెచ్ఎంసీ నేడు ప్రారంభించింది. నాలాలపై అత్యంత క్రిటికల్‌గా ఉన్న 738 అక్రమ నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన కూల్చివేయాలని నిర్ణయించినందున అక్రమ నిర్మాణదారులకు ఇప్పటికే నోటీసులు జారీచేశారు.నాలాల ఆక్రమణల కూల్చివేతలో, ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు సిద్ధంగా ఉన్న వాంబే కాలనీలను కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పటిష్టమైన పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు ప్రారంభించారు.
జరిగిన కూల్చివేతలు
* ముర్కినాలా పరివాహక ప్రాంతాలైన జోరాబిదర్గా, అల్‌జుబైల్ కాలనీ, అషిమాబాద్, ఉప్పుగూడ శివాజినగర్‌ల వద్ద అక్రమ కట్టడాల తొలగింపు.
* వెంకటాపురం ఎంఇఎస్ కాలనీ నాలాపై ఆక్రమణల తొలగింపు
*సర్కిల్ 8 శివాజి నగర్‌లోని నాలాలపై ఆక్రమణల తొలగింపు
* అంబర్‌పేట్ కింగ్స్ హోటల్ వద్ద ఆక్రమణల తొలగింపు
* మాల్కాజిగిరిలోని బండచెరువు డ్రెయిన్‌పై ఆక్రమణల కూల్చివేత.
* జనప్రియనగర్‌లోని పటేల్ చెరువు నాలాపై సీసీరోడ్డు నిర్మాణాన్ని తొలగింపు.
* శేరిలింగంపల్లిలో నాలాలపై నాలుగు ఆక్రమణల తొలగింపు
* చందానగర్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు.
* బాలానగర్‌లోని ప్రశాంత్‌నగర్ నాలాపై ఆక్రమణల తొలగింపు.
* మల్కాజిగిరి ఎన్.ఎం.డి.సి కాలనీలోని నాలుగు ఆక్రమణల తొలగింపు.
* అంబర్‌పేట్ బాపూనగర్ మోహినిచెరువు నాలాపై ఆక్రమణల తొలగింపు.
* సర్కిల్ 24 కూకట్‌పల్లిలోని నల్లచెరువు నాలాపై ఆక్రమణల తొలగింపు.* అల్వాల్ లోతుకుంట ఇందిరానగర్‌లో అక్రమ షెడ్‌ల తొలగింపు. * మూసాపేట్ సర్దార్‌నగర్‌లోని నాలాపై ఆక్రమణల తొలగించారు.