తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి . అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించారు .. ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. టీఎస్‌పీఎస్సీ బాగా పని చేస్తున్నదన్నారు. గ్రూప్-2 లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. గ్రూప్ -2 పరీక్ష పూర్తి వివరాలు హైకోర్టుకు సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు.
