అసెంబ్లీలో రైతు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ కొనసాగుతున్నది. రైతు సంక్షేమంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల బతుకులు బాగుపడ్డాయని మంత్రి అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇప్పిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం సంక్షోభంలో ఉండేదని మంత్రి వెల్లడించారు. మూడేండ్ల పాలనలోనే రైతులను సంక్షోభం నుంచి సంక్షేమంలోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.
వ్యవసాయానికి కరెంట్ కొరత లేకుండా చేశామన్నారు. దిగుబడి పెంచేందుకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేశామని మంత్రి అన్నారు. దిగుబడి పెంచేందుకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేశామని మంత్రి తెలియజేశారు. కోటి ఎకరాలకు సాగు నీరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి చెప్పారు.భూ రికార్డుల ప్రక్షాళన చారిత్రక అంశమని ఆయన ఉద్ఘాటించారు. రైతులను అప్పుల బాధ నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాల్వలను మరమ్మతు చేసి పంటలకు సాగు నీరందించామన్నారు. ఇప్పటి వరకు 10,800 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిందని మంత్రి వివరించారు.