తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు, హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో వీరు ఎదురుపడ్డారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిఉద్దేశించి గడ్డం ఎప్పుడు తీస్తావ్… అని ఎర్రబెల్లి అనగా 2019లో తీస్తా… అని ఉత్తమ్ అన్నారు. అంతేగాక కూల్‌గా ఉన్నావ్.. అని ఎర్రబెల్లితో ఉత్తమ్ అనగా నాకు టెన్షన్స్ పోయాయి.. నీకు టెన్షన్స్ మొదలయ్యాయి అని ఎర్రబెల్లి నవ్వుతూ సమాధానమిచ్చారు .
