వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని మీడియాలో వార్తలు తెలిసిందే. ఈ క్రమంలో ఈ వార్తలపై ఇవాళ కొండా సురేఖ దంపతులు మీడియాతో మాట్లాడి దీనిపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. కడదాకా టీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్ తోనే ఉంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా.. ఇటీవల టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్‌రెడ్డి గురించి కొండా సురేఖ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి రాగానే రేవంత్ వాపును చూసి ఆ పార్టీ సీనియర్ నేతలు బలుపు అనుకుంటున్నారంటూ సురేఖ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే 2019లో కాంగ్రెస్‌కు పడుతుందని ఆమె జోస్యం చెప్పారు.