మిడ్ మానేరు కాళేశ్వరం ద్వారా ప్యాకేజీ – 9 మల్కపేట రిజర్వాయర్ నుంచి నిమ్మపెల్లి మూలవాగు ప్రాజెక్టులోకి లిఫ్టు ద్వారా నిమ్మపెల్లి, వట్టివల్ల, మరిమడ్ల, గర్జనపల్లి, అడవి పదిర, మద్దిమల్ల తదితర గ్రామాలలో 10 వేల ఎకరాలకు నిళ్లందించే లిఫ్టుకు 167 కోట్ల నిధులు మంజూరు పరిపాలనా అనుమతి వచ్చిన సందర్భంగా వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి హృదయ పూర్వక దన్యవాదాలు తెలిపారు. ఈ లిఫ్టు ద్వారా నిమ్మపల్లి ప్రాజెక్టు కింద 2 పంటలు స్థిరీకరణతో పాటు మూలవాగు పరివాహక ప్రాంతం సస్యశ్యామలం అయ్యే గొప్ప అవకాశం కల్పిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇటీవల సిరిసిల్లకు వచ్చిన సందర్భంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కేవలం మూడు వారాల్లో లిఫ్టు మంజూరు చేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎల్లప్పటికీ ముఖ్యమంత్రిగారికి రుణపడి ఉంటారు అని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తెలిపారు.
