శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నాయిని విమర్శించారు. కాంగ్రెస్ పాలకులు హైదరాబాద్ నగరాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లు 50 ఏళ్లు పాలించి తెలంగాణను లూటీ చేశారని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మూడేళ్లలో హైదరాబాద్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సిగ్నల్ రహిత నగరంగా హైదరాబాద్‌ను తయారు చేస్తున్నామని ఉద్ఘాటించారు.
