Home / TELANGANA / 60 ఏళ్ల‌లో చేయ‌నిది 3 ఏళ్ల‌లో టీఆర్ఎస్‌ చేసింది..!

60 ఏళ్ల‌లో చేయ‌నిది 3 ఏళ్ల‌లో టీఆర్ఎస్‌ చేసింది..!

తెలంగాణ వ‌స్తే ఏం వ‌చ్చింద‌నే వారికి, కొంద‌రు నిత్య నిర‌స‌న‌కారుల‌కు మంత్రులు ఘాటు స‌మాధానం ఇచ్చారు. క‌ల్వ‌కుర్తి జిల్లాకు చెందిన ప‌లువురు నేత‌లు మంత్రులు కేటీఆర్‌, ల‌క్ష్మారెడ్డి, జూప‌ల్లి కృష్ణారావుల స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ ఇటీవ‌లి పరిణామాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. మంచిగా ఉన్నవాళ్లు ఒకవైపు మిగతా వాళ్లంతా ఒకవైపు ఉన్నార‌ని వివ‌రించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాకు రావడం జరిగింది….ఈ ప్రాజెక్టును పూర్తి చేద్దాం అని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే దీనికి కొంత మంది కేసులు వేసి అడ్డు పడుతున్నారని మంత్రి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. 2 సంవత్సరాలలో కల్వకుర్తి మొత్తం నీళ్లు అందిస్తామ‌ని ఇందులో ఎవ్వరికీ డౌట్ అవసరం లేదని అన్నారు. భారత దేశం లొనే ఏ ప్రభుత్వం చేయలేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణా ప్రభుత్వం తీసుకొచ్చిందని….కేవలం సంక్షేమ పథకాలకు  40 వేల కోట్లు  తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంద‌ని వివ‌రించారు. ఈ మూడు సంవత్సరాలలో కల్వకుర్తి టౌన్ కు 9  కోట్ల పింఛన్ ఇచ్చార‌ని తెలిపారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి ఈ మూడేళ్ళలో ఏం చేశార‌ని  అడుగుతున్నారని అయితే దానికి తాను స‌మాధానం చెప్తున్నాన‌ని వివ‌రించారు. “రాదు అనుకున్న తెలంగాణా రాష్ర్టాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో సాదించుకున్నాం. గులాబీ ద‌ళ‌ప‌తి, సీఎం కేసీఆర్ సార‌థ్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము. ప్రతి పథకంపై పూర్తి అవగాహనతో పేదప్రజలకు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్  ప్రవేశ పెడుతున్నారు“అని తెలిపారు.

రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామ‌ని మంత్రి జూప‌ల్లి వివ‌రించారు. గ్రామాల్ని కూడా డెవలప్‌మెంట్ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివ‌రించారు. రైతులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే 24 గంటల విద్యుత్తు ఇచ్చామ‌ని….జనవరిలో తాగునీరు కూడా అందిస్తామ‌ని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నిసార్లు ఎన్నిక‌లు వ‌చ్చినా ప్రజలు మొత్తం టీఆర్ఎస్ పార్టీ వైపే నిలుస్తున్నారని…. దీన్ని ప్రతిపక్ష పార్టీ లు తెలుసుకోవాలని కోరారు. 60 సంవత్సరాలు చేయలేని పనులన్నీ తెలంగాణా ప్రభుత్వం ఈ మూడేళ్ళలో చేసి చూపించిందని అన్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అన్ని వచ్చే ఎలక్షన్ లలో డిపాజిట్ లు వస్తాయా రావా అనేది చూసుకోవాలి తప్ప ఇంకొక అవకాశం లేదని వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat