కాంగ్రెస్ పార్టీలో శృతిమించిన స్వేచ్ఛకు మరో నిదర్శనం. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ పార్టీలో ఏకంగా సీనియర్ల ముందే..బాహాబాహీకి దిగారు. ఇది ఆదిలాబాద్‌లో జరిగింది. ఇందిరా జయంతి సందర్భంగా కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో వివాదం ఏర్పడడంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. వేదికపై కుర్చీల కోసం కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నాయకులు వీహనుమంతరావు ఎదుటే మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, పార్టీ నేత గండ్రత్ సుజాత వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్ద ఎత్తున వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఇదంతా మీడియా సాక్షిగా జరగడం గమనార్హం. దీంతో అసహనానికి గురైన వీహెచ్ వేదికపై నుంచి దిగిపోయారు. వీహెచ్‌ను కొందరు నేతలు సముదాయించారు.
Post Views: 427