తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురవుతోందని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.. రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ అని.. చిత్తశుద్ధివుంటే ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని పంటలకు మద్దతుధర కల్పిస్తామని, రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ..నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
