తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఏపీ మంత్రి నారాయణ కు సంబంధించిన నారాయణ కళాశాలలో విద్యార్ధిని ఆత్మహత్యకి పాల్పడింది .విషయానికి వస్తే నగరంలో వెంకట్రావు నగర్ లో నారాయణ కళాశాల్లో భద్రాది-కొత్తగూడెం జిల్లాకు చెందిన నాగేశ్వర్ గౌడ్ కూతురు నవ్యశ్రీ ఇంటర్మీడియట్ చదువుతుంది .
ప్రిన్సిపాల్ చంద్రిక ,అధ్యాపకురాలు కీర్తి కల్సి గత ఆరు నెలలుగా నవ్యశ్రీని బాగా చదవాలని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు .ఆదివారం నవ్యశ్రీపై కీర్తి చేయి కూడా చేసుకుంది .దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవ్య ఆత్మహత్యాయత్నం చేసింది
.ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధి తల్లి దండ్రులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు .