తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెల్సిందే .అందులో పన్నెండు మంది గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కారేక్కారు .
మిగిలిన ముగ్గురులో ఒకరు టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు .వీళ్ళు పోను మిగిలింది ఇద్దరే ఎమ్మెల్యేలు .అందులో ఒకరు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరొకరు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య .
అయితే తాజాగా సండ్రకు నియోజక వర్గంలో అతని ప్రధాన అనుచరవర్గం అంతటా టీఆర్ఎస్ గూటికి చేరారు .అందులో భాగంగా ఖమ్మం జిల్లా టీడీపీ కార్యదర్శి ,ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడుగా ముద్రపడిన గొట్టిపాటి రాధయ్య ,మరో ముఖ్య అనుచరుడు పెనుబల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మోరంపూడి బాబురావు టీడీపీ కార్యకర్తలతో ,అనుచరులతో స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు
.