తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నేటి నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దాదాపు ప్రపంచంలోని 150 దేశాల నుండి పది హేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్న సంగతి తెల్సిందే .ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,ఆయన వ్యక్తిగత సలహాదారి ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు .
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా సారిగా వస్తున్న ఇవంకాను ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రానికి రప్పించడానికి వేసిన ప్రణాళికలు చిత్తు అయ్యాయి .రాష్ట్ర విభజన తర్వాత అందర్నీ తమ రాష్ట్రానికి ఆహ్వానించి ఏపీని బ్రాండ్ అంబాసిడర్ గా మారుద్దామని భావిస్తున్న తరుణంలో హైదరాబాద్ మహానగరానికి విచ్చేయుచున్న ఇవంకాను ఏపీకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని పంపించారు అంట.
అయితే చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు ఇవంకా చెక్ పెట్టారు .తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కేవలం జీఈఎస్ సదస్సుకు మాత్రమే హాజరవ్వాలని ..ఇంకా ఏ కార్యక్రమాలు పెట్టుకోవద్దు అని ఆమె తమ అమెరికా కౌన్సులేట్ కు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఒక ఉన్నత అధికారి వెల్లడించారు.