తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన కొలువులకై కొట్లాట సభకు రాష్ట్ర బీజేపీ పార్టీ మద్దతిచ్చింది. శుక్రవారం బీజేపి కార్యాలయంలో టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మట్లాడుతూ..తెలంగాణ నిరుద్యోగ యువత కోసం టీజేఏసీ చేస్తున్న ‘కొలువులకై కొట్లాట’ సభకు బీజేపీ మద్దతు తెలిపిందని అన్నారు . టీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన మోదీ పర్యటన తర్వాత పొత్తులపై ఓ స్పష్టత వచ్చిందని అన్నారు. గుజరాత్‌లో ఎన్నికల తర్వాత తెలంగాణలో మోదీ, అమిత్ షా పర్యటిస్తారని ఆయన తెలిపారు.
