కొత్తగూడెం నియోజకవర్గంలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది.ఈ రోజు డిసెంబర్ 5 వ తేదీ మంగళవారం డిల్లీ లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ గారిని ఖమ్మం లోక్ సభ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు కలిశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసిందిగా వినతి పత్రం సమర్పించారు.
1975 లో కేంద్ర,రాష్ట్ర ప్రభ్యుత్వాలు కలిసి పాల్వంచలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేశారని వారు గుర్తు చేశారు. దీనిని 2008 లో NMDC లో విలీనం చేశారన్నారు.ఇదే ఫ్యాక్టరీ లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి అనేక అవకాశాలున్నాయని వారు వివరించారు. సమీపంలోనే KTPS వుండడం వల్ల విద్యుత్ సౌకర్యం వుందని,ప్రతిపాదిత స్థలం పక్కనే జాతీయ రహదారి వుందని, రైల్వే స్టేషన్ కూడా అతి సమీపంలోనే వుందని వివరించారు.వీరిద్దరి విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.కొద్ది రోజుల క్రితమే ఈ విషయం గురించి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు కూడా కేంద్ర మంత్రి తో చర్చించారు.
Post Views: 221