తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖా మంత్రి కే తారక రామారావు మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. చేనేత రంగానికి గణనీయమైన సేవలు అందిస్తున్న పద్మశ్రీ చింతకింది మల్లేశంకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని చేనేత మరియు ఔళి శాఖ మంత్రి కేటీఆర్ అందించారు. ప్రభుత్వం అందించిన ఈ కోటి రూపాయల గ్రాంట్ తో చింతకింది మల్లేశం తన లక్ష్మి అసు మిషిన్ల ఉత్పత్తిని పెంచేందుకు, మరియు చేనేత రంగానికి అవసరం అయిన ఇతర ఆవిష్కరణలు చేసేందుకు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం ఆలేరులోని తన సొంత ఇంటి నుంచి ఆసు మెషిన్లను మల్లేశం తయారుచేస్తున్నారు. సుమారు 650 మెషిన్లకు డిమాండ్ ఉంది. ఈ ఆర్థిక సహాయం ద్వారా మెషిన్లను తయారు చేసేందుకు కోసం వీలు కలుగుతుంది. వీటిని మెదట పోచంపల్లిలో పాత పద్దతుల్లో చేనేత పనులు నిర్వహిస్తున్న కార్మికులకు సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది. దీంతోపాటు తెలంగాణలోని చేనేత కార్మికులకు ఉపయోగపడే ఈ మెషిన్లకు భవిష్యత్తులో మరింత డిమాండ్ వస్తుందని, ఈ డిమాండ్‌కు అనుగుణంగా తన ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన ఇంజనీరింగ్ మరియు ఇతర సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి చింతకింది మల్లేశం ఆర్థిక సహాయం కోసం గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మల్లేశం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం టెక్స్టైల్ శాఖ తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినది. ఈ మేరకు మంత్రి కేటీ రామారావు ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఆర్థిక సహకారానికి సంబంధించిన పరిపాలన ఉత్తర్వులను మంత్రి మల్లేశంకు అందించారు. ఒక ఎకరం భూమిలో షెడ్డుతో పాటు, కార్యాలయము, రవాణా వాహనం, మెషినరీ, వర్కింగ్ క్యాపిటల్ వంటి వాటి కోసం ఈ కోటి రూపాయలను వినియోగించనున్నట్లు చింతకింది మల్లేశం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు సాధ్యమైనంత ఎక్కువగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని, ఇప్పటికే టెక్స్‌టైల్ శాఖకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేశామని మంత్రి అన్నారు.
Minister @KTRTRS handed over a sanction letter of Rs One Crore to rural innovator and Padma Shri awardee Chintakindi Mallesham for setting up of a manufacturing unit to produce Laxmi ASU Machines 1/2 pic.twitter.com/GZQqihZiNM
— Min IT, Telangana (@MinIT_Telangana) December 5, 2017