క్రిస్మస్ పండుగ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది . రాష్ట్రంలోని తండాలను పంచాయతీలు గా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పాటు అనుబంధ గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చాలని భావిస్తున్నారు.తండాలను పంచాయతీలుగా మార్చడానికి,గ్రామాలకు నిధులు కేటాయించడంతో పాటు అధికారాలు కల్పించడానికి ప్రత్యేకంగా చట్ట సవరణ చేయాల్సి ఉంది. దీంతో గ్రామపంచాయతీ చట్టానికి సవరణలు రూపొందిస్తున్నారు. సవరణ బిల్లు ముసాయిదా దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ వారంలో దానికి తుది రూపు ఇవ్వనున్నారు. మరోవైపు బీసీల సమస్యలపై ఒక్క రోజు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం కేసీఆర్ బీసీ ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. BC సమస్యలపై చర్చ, పంచాయతీ రాజ్ సవరణ బిల్లుతో పాటు…మరో బిల్లు ఆమోదం పొందాల్సి ఉన్నందున ఈ నెల చివరి వారంలో రెండు,మూడు రోజులు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
