నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2108 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది.
భర్తీ కానున్న పోస్టుల వివరాలు :
స్టాఫ్ నర్స్ లు 1603
టెక్నికల్ అసిస్టెంట్లు 110
టెక్నిషియన్స్ 61
గ్రేడ్ 2 ఫార్మసిస్టులు 58
ల్యాబ్ టెక్నిషియన్స్ 39
జూనియర్ అసిస్టెంట్లు 30
డార్క్ రూం అసిస్టెంట్లు 26
రేడియోగ్రాఫర్స్ 18
మెటర్నిటీ అసిస్టెంట్లు 15
అనస్థీషియా టెక్నిషియన్స్ 10
స్టోర్ కీపర్లు/రికార్డ్ క్లర్క్/కంప్యూటర్ ఆపరేటర్లు 54తో సహా పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.