తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను టెక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని షియోమీ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మనుకుమార్ జైన్ ప్రశంసించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా కలిసిన మనుకుమార్ మంత్రిని కలిసిన అనంతరం ఓ ట్వీట్ చేశారు.
‘తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌తో గొప్ప సమావేశం జరిగింది. హైదరాబాద్‌ను టెక్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఆయన విజన్ ప్రశంసనీయం. ఆయన ఆవిష్కరణలు,వేగం..ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని మంత్రి కేటీఆర్‌పై షియోమీ ఉపాధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ…‘చాలా సంతోషం మనూ. మీతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
Great meeting KT Rama Rao @KTRTRS, IT & Urban Development minister of Telangana. He is also the son of H'ble @TelanganaCMO Mr. Rao.
Highly impressed by KTR's vision of transforming Telangana & Hyderabad into a tech hub! ?
Really looking forward to his initiatives. Godspeed! pic.twitter.com/TPFQ366vq0
— Manu Kumar Jain (@manukumarjain) December 13, 2017