తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఎల్బీస్టేడియం ప్రధాన వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాసభల ముగింపు వేడుక చివర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన లేజర్ షో వీక్షకులను కనువిందు చేసింది. ఎల్బీస్టేడియం ప్రధాన వేదికపై.. ఆకట్టుకునే మ్యూజిక్‌తో ఆకుపచ్చ రంగులో సర్కిల్‌లో 10 నుంచి మొదలైన అంకెలు ఒకటితో ముగిసి, ఓం అనే సంగీతంతో మొదలైన డప్పుల సంగీతం నడుమ, స్టేడియం చుట్టూరా ఉంచిన లేజర్ షో వీక్షకులను ఆకట్టుకున్నాయి. కనులను మిరుమిట్లు గొలిపేలా లేజర్ లైట్ల ప్రదర్శన ఆకట్టుకున్నాయి.
