ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై చర్చా కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత , ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్లభరణి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు భాషకు పునరుజ్జీవం పోసిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం అని అన్నారు . భాషాభిమానులతో ప్రపంచ తెలుగు మహాసభలు కిక్కిరిసి పోతున్నయన్నారు.
అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ..తెలుగు భాష పట్ల ప్రవాస తెలుగువారికి మక్కువ ఎక్కువన్నారు. తెలుగు మహాసభల్లో సాహిత్యానికి పెద్ద పీట వేశామన్నారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగును తప్పనిసరి చేయడంతో ఎంతోమంది స్వాగతించిన్రన్నారు.విదేశాల నుంచి మహాసభలకు వచ్చిన ప్రవాస తెలుగువారికి ఎంపీ కవిత ధన్యవాదాలు తెలియజేశారు