గత అక్టోబర్ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో వేల హెక్టార్లలో పత్తి రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కోరారు. దేశ వ్యాప్తంగా ప్రకృతి విపత్తుల కారణంగా జరిగిన నష్టంపై లోక్ సభలో జరిగిన చర్చలో జితేందర్ రెడ్డి మాట్లాడారు.కృష్టా జలాల పంపకంలో కూడా రివర్ మేనేజ్‌మెంట్ బోర్టు, ట్రిబ్యునల్ విఫలమయ్యాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణకు రావాల్సిన జలాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ పట్టించుకోలేదని జితేందర్ రెడ్డి తెలిపారు .
