పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను చూసి ఎన్నారైలు ఆశ్చర్చపోతున్నరన్నారు. దేశంలోనే సంక్షేమ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు . కేసీఆర్ కిట్ల పంపిణీతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగినట్లు చెప్పారు.
