సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల గేట్ల పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నేపల్లి పంప్ హౌజ్ వద్ద నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంప్‌హౌజ్ పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు, డిజైన్లపై సమీక్షించారు. సుందిళ్లకు 74, అన్నారం బ్యారేజీకి 66, మేడిగడ్డకు 85 గేట్లు బిగించాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. షెడ్యూల్ ప్రకారం గేట్ల బిగింపు పనులు పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. ఈ సమీక్షలో కలెక్టర్ మురళి, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, నీటిపారుదల, జెన్‌కో ఇంజినీర్లు పాల్గొన్నారు.