తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగార పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనాల సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీ స్థాయిలో గొల్ల, కుర్మలు పాల్గొన్నారు.
