Home / TELANGANA / తెలంగాణ మాగాణం..వడివడిగా ‘కొండపోచమ్మ’ పనులు..!

తెలంగాణ మాగాణం..వడివడిగా ‘కొండపోచమ్మ’ పనులు..!

తెలంగాణ మాగాణం సిరుల పంట‌లు పండించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయిని అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని ఆయా జిల్లాలకు గోదావరి జలాలను సాగుకు అందించడానికి నిర్మించ తలపెట్టిన కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో అడ్డంకులు, అవరోధాలను అధిగమించిన ప్రభుత్వం పనులను ప్రారంభించడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు. 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ వల్ల మూడు రెవెన్యూ గ్రామాలు అంతర్ధానం కానున్నాయి. మొత్తం 4600 ఎకరాల విస్తీర్ణంలో గోదావరి జలాలు కమ్ముకుపోనున్నాయి.

సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని బహిలీంపూర్, మామిడ్యాల, తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండాలకు చెందిన భూములను ప్రభుత్వం సేకరించింది. 15.8 కిలోమీటర్ల వలయాకారంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం కానుంది. రిజర్వాయర్ నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు 18 నెలల ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు అధికారులు మాత్రం పనులను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. వచ్చే జూన్ నెలాఖరు నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులు కృషి చేస్తున్నారు. రెండు విభాగాలుగా విభజించిన ఈ ప్రాజెక్టును ఒక విభాగానికి 900 కోట్లు, మరో విభాగానికి 700 కోట్ల చొప్పున కేటాయించారు. ఇద్దరు ప్రధాన కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో ఉప కాంట్రాక్టర్లు పనులు కొనసాగిస్తున్నారు. కట్ట నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా పటిష్టవంతంగా కొనసాగిస్తున్నారు. సుమారు 6 మీటర్ల లోతు నుంచి చుక్కనీరు కూడా బయటకు జాలువారకుండా ఉండే విధంగా నిర్మాణం చేయడంలో అధికారులు తలమునకలయ్యారు.

నిర్వాసితులకు ఎకరానికి 12 లక్షల చొప్పున పరిహారంగా చెల్లించడంతో పాటు పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీతో గ్రామాల ప్రజలు పనులకు ఎలాంటి ఆటంకం కల్పించడం లేదు. పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను, సాంకేతిక నిపుణులను తీసుకువచ్చారు. బహిలీంపూర్, మామిడ్యాల, తానేదార్‌పల్లి తదితర ప్రాంతాల్లో కూలీలు తాత్కాలిక గుడారాలు వేసుకుని ఆశ్రయం పొందుతూ కొండపోచమ్మ రిజర్వాయర్ పనుల్లో నిమగ్నమవుతున్నారు. 2019 ఎన్నికల నాటికి గోదావరి జలాలను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగుకు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన శపథాన్ని అధికారులు నిలబెట్టే అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat