స్వరాష్ట్ర సాధన కోసం క్రియాశీలంగా పోరాడిన ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఛైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటన ఇది..
“తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మెన్ గా నియమించి నన్ను ప్రోత్సహిస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, నాకు దైవ సమానులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పాదాభి వందనాలు. నన్ను సోదరునిగా ప్రేమించి.. ముందుకు నడిపిస్తున్న అన్న హరీశ్ రావు గారికి, కేటీరామారావు గారికి, అక్క కవిత గారికి, పార్టీ నేతలకు, కార్యకర్తలకు మనస్పూర్తిగా కృతజ్ఙతలు.
నాది కేసీఆర్ గారి నియోజక వర్గం సిద్ధిపేట కావడంతో నాకు ఊహ తెలిసినప్పుటినుండి ఆయనే నాకు రోల్ మాడల్ నాయకుడు. నేను ఈ రోజు స్థాయిలో ఈ పదవికి అర్హుడిని అయ్యానంటే అది కేసీఆర్ గారి దీవెనెల వల్లే. కేసీఆర్ సైన్యంలో నేనోక సైనికుడిగా తెలంగాణ కోసం ఉధ్యమించే అవకాశాన్ని కల్పించారు. విధ్యార్థి నాయకునిగా తెలంగాణ రాష్ట్ర సమితి విధ్యార్థి విభాగం అధ్యక్షుడిగా, పార్టీ పౌలిట్ బ్యూరో సభ్యునిగా, టీఆర్ఎస్‌వీ ఇంఛార్జిగా పార్టీకి సేవ చేసే మహా భాగ్యాన్ని కల్పించారు. ఇప్పుడు అంతే నమ్మకంతో నాకు ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మెన్ గా బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా.. నా మీద ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను త్రికరణశుద్ధితో నెరవేర్చుకుంటా..
బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా అలుపెరుగకుండా శ్రమిస్తున్న కేసీఆర్ గారి అడుగులో అడుగు వేస్తు నా ఈ కొత్తబాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాను. తెలంగాణలో బలహీన వర్గాల అభ్యున్నతికోసం, ఆత్మగౌరవంతో బతికేందుకోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు చేపట్టిన సంకల్పంలో నేను కూడా బాగస్వామిని కావడం గర్వంగా ఉంది. యువతకు, పార్టీని నమ్ముకున్న నాలాంటి వారికి, నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలకు కేసిఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్న దానికి నాకు లభించిన ఈ అవకాశమే ప్రత్యక్ష ఉదాహరణ. మరో సారి నా ఉన్నతికి సహకరించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు
మీ
డా. ఎర్రోళ్ల శ్రీనివాస్
ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మెన్
తెలంగాణ ప్రభుత్వం